ప్రతీ భారతీయుడు రోజుకి ఒక్కసారినా వినాల్సిన,పాడాల్సిన గీతం

updated: March 9, 2018 13:39 IST
ప్రతీ భారతీయుడు రోజుకి ఒక్కసారినా వినాల్సిన,పాడాల్సిన గీతం

ఆర్.ఎస్ ఎస్ అనగానే క్రమ శిక్షణ గుర్తుకు వస్తుంది. ఖాఖీ నిక్కరు, తెల్ల చొక్కా చేతిలో లాఠీతో ... సుశిక్షితులైన కార్యకర్తలతో మారు పేరుగా ఉంటుంది.  కేవలం భారతీయ విలువలను కాపాడటం మాత్రమే కాదు , ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం లోనూ ముందు ఉండటం, సంస్ద పుట్టినప్పటి నుంచీ మొదలైంది. యుద్ద సమయాల్లో  స్పందించటంలోనూ, ప్రజల్ని ఆదుకోవటంలోనూ   ఆర్.ఎస్ ఎస్ కార్యకర్తలు ముందుంటూ వచ్చారు.  నిత్యం అశాంతితో రగిలే ప్రాంతాల్లోనూ వేలాది మంది చిన్నారుల బాగోగుల్ని చూస్తోంది. తమ సేవాభారతి తరుపున డిల్లీ బోర్డింగ్ పాఠశాలల్లో విద్యనందిస్తున్నారు. వరదలు వచ్చినా, ఉప్పెనలు వచ్చినా ఆర్.ఎస్ ఎస్ కార్యకర్తలు ముందు ఉంటారు.  స్త్రీల కోసం ప్రత్యేకమైన విభాగం సైతం కలిగి ఉన్న ఆర్.ఎస్ ఎస్..1971లో బంగ్లాదేశ్ పోరాటం సమయంలో ఎంతోమంది క్షతగాత్రులకు రక్తదానం చేసి భాధితులకు ప్రాణం పోసి,వారి హృదయాల్లో శాశ్వత స్దానం పొందారు. దేశంలో రక్తదానం మాట వినపడటం అదే తొలిసారి కావటం విశేషం.  ప్రజా సేవ... మరియు దేశ సేవ చేయటానికి తయారుగా ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక సేవా సంస్థ... ఆర్ ఎస్ ఎస్ అదే మన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ... వారి ప్రార్దనా గీతం చాలా ప్రఖ్యాతి పొందింది. 

నమస్తే సదా వత్సలే మాతృభూమే
త్వయా హిన్దుభూమే సుఖవ్ వర్ధితోహమ్
మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే
పతత్వేష కాయో నమస్తే నమస్తే ||

ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ 'వందేమాతరం' గీతాన్ని తనదైన శైలిలో సంగీతం సమకూర్చి విన్నూతనంగా  ప్రెజెంట్ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే . అప్పటిదాకా వందేమాతరం గం HMV  వాళ్లు ప్రొడ్యూస్ చేసిన పాటనే అన్ని చోట్లా వినపడేది. రహమాన్ స్వరపచిరిన గీతం వచ్చి సూపర్ హిట్ అయ్యాక, అంతటా ఇది కూడా వినపడటం మొదలైంది. తర్వాత రోజుల్లో అది ఓ ప్రభంజనమే అయ్యింది. ఎంతలా అంటే విదేశాలకు పోగ్రామ్స్ కు  వెళ్తే ఖచ్చితంగా ఎఆర్ రహమాన్ ని ఈ గీతం పాడి వినిపించాల్సిందే. 

ఇక ఆర్.ఎస్ వారి ప్రార్దనా గీతం అయిన "నమస్తే సదా వత్సలే మాతృభూమే"  ఎంత గొప్ప దేశ భక్తి గీతమో మనందరికీ తెలిసిందే. ఈ గీతాన్ని ఇప్పటివరకూ వేరే ట్యూన్స్ లో ఎవరూ పాడలేదు.. అయితే ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచంలో దూసుకుపోతున్న PicsarTV   వారికి ఈ ప్రార్ధనా గీతాన్ని కొత్త శైలిలో చేద్దామనే ఆలోచన రావటం, వెంటనే ప్రముఖ సింగర్ మరియు సంగీత దర్శకుడు సాయి శ్రీకాంత్ ని అడగటం, ఆయన స్వయంగా స్వరపరచడం  వెంటనే జరిగిపోయాయి. ఈ పాట కూడా ఎఆర్ రహమాన్ వందమాతరం లేదా జనగనమణ లాగా  ప్రజల హృదయాల్లోకి వెళ్తుందని ఆశిద్దాం. 

ఇంత గొప్ప దేశ భక్తి  గీతాన్ని డా.కె.బి హెగ్డేవర్ మరియు మాధవ్ శశిదేవ్ గోలవర్కర్ ఆధ్వర్యంలో ప్రముఖ సస్కృత ప్రొపెసర్ శ్రీ నరహర్ నారాయణ్ బిండే రాయటం జరిగింది. ఇంతటి గొప్ప గీతాన్ని జాతికి అందించిన వారికు ఈ వీడియో అంకితం.

నమస్తే సదా వత్సలే మాతృభూమే .....అంటూ  సాగే ఈ గీతం మన హృదయాలను సూటిగా తాకుతుంది. మన మాతృభూమిపై మనకున్న ప్రేమను తట్టి లేపుతుంది. ఖచ్చితంగా ప్రతీ భారతీయుడు వినాల్సిన ఈ గీతం మీ కోసం ..ఇక్కడ 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments